వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!

- October 13, 2025 , by Maagulf
వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!

కువైట్: వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసన్స్ అమ్మకాలపై కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఉత్పత్తులను వెండింగ్ యంత్రాల ద్వారా ప్రదర్శించవచ్చని, విక్రయించవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దేల్-వహాబ్ అల్-అవధి ఉత్తర్వులను జారీ చేశారు. నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా ఎలక్ట్రానిక్‌గా దరఖాస్తులను సమర్పించి, అనుమతి తీసుకోవాలని నిర్దేశించారు.

సదరు ఫార్మసీలు చెల్లుబాటు అయ్యే ఆపరేటింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని,  యంత్రాలను పర్యవేక్షించడానికి లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్ లేదా టెక్నీషియన్‌ను నియమించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రతి ఫార్మసీ గరిష్టంగా ఐదు వెండింగ్ మెషీన్‌లను నిర్వహించవచ్చు. ప్రతి యంత్రానికి లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుందని, అన్ని అవసరాలను తీర్చిన తర్వాత పునరుద్ధరించబడుతుందన్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com