మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- October 13, 2025
భారతదేశానికి చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 48 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోటీలలో భారతీయురాలు గెలిచిన తొలి సందర్భం ఇది. షెర్రీ సింగ్ ఘనత సాధించడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు పొందింది.
ఈ ఘనత ఫిలిప్పీన్స్ రాజధాని మానిలాలో జరిగే 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీలలో సొంతమైంది. పోటీల్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 120 మంది మంది మహిళలు పాల్గొన్నారు. పోటీ అత్యంత గట్టి మరియు కఠినమైనది గా ఉండగా, అందులో షెర్రీ సింగ్ తన ప్రతిభ, సౌందర్యం, ధైర్యం, బుద్ధి ద్వారా కిరీటాన్ని గెలుచుకున్నారు..
9 ఏళ్ల క్రితం షెర్రీ సింగ్‌కు వివాహం కాగా.. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తనకు మిసెస్ యూనివర్స్ కిరీటం దక్కడంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం తన ఒక్కదానిది మాత్రమే కాదని.. తమ పరిస్థితులను దాటుకుని.. కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు.
ఆత్మవిశ్వాసం, బలం, దయ అనేవి నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని తాను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని షెర్రీ సింగ్.. ఉమెన్ ఫిట్‌నెస్ ఇండియా (India) కు తెలిపారు. ఇక మిసెస్ యూనివర్స్ 2025 (Mrs. Universe 2025) విజేతగా షెర్రీ సింగ్ పేరును ప్రకటించినప్పుడు ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ కిరీటం సాధించడంపై ఆమె మెంటర్, నేషనల్ డైరెక్టర్ ఊర్మిమాలా బోరువా స్పందించారు. తాము ఎల్లప్పుడూ షెర్రీ సింగ్ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంచామని.. ఆమె సాధించిన చారిత్రక విజయం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. తన దేశానికి గౌరవంగా,
ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతీ మహిళకు షెర్రీ సింగ్ ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసిందని ప్రశంసలు గుప్పించారు. 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. మిసెస్ యూనివర్స్ కిరీటం చివరికి ఇంటికి తిరిగి వచ్చిందని యూఎంబీ పేజెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పోటీలో విజేతలుగా గుర్తించడానికి గ్రాండ్ ఫినాలేలో కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్లుగా పేద నేపథ్యం నుంచి వచ్చిన బాలికల విద్యకు మద్దతు ఇచ్చే అనేక సంస్థలతో కలిసి పనిచేశారు.
తాజా వార్తలు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!