యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!

- October 15, 2025 , by Maagulf
యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!

యూఏఈ: యూఏఈలో కొనసాగుతున్న అల్పపీడన వ్యవస్థ కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.  దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ నెలకొన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ మరియు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.  అబుదాబిలోని అల్ దఫ్రా ప్రాంతంలో వరదలు సంభవించాయి.

మరోవైపు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అక్టోబర్ 17న ప్రార్థనకు అరగంట ముందు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో వర్షాలు కురవాలని ఇస్తిస్కా ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com