విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- October 15, 2025
అమెరికా: ఇటీవల, అమెరికా న్యాయ శాఖ (DOJ) అత్యంత పెద్ద పరిమాణంలో బిట్‌కాయిన్‌ను సీజ్ చేసింది. ఈ సీజ్ రూ.127,271 BTC — సుమారుగా 15 బిలియన్ డాలర్లు విలువైనది. సుమారు 14 బిలియన్ల డాలర్ల విలువైన బిట్‌కాయిన్ ను అమెరికా ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ కేసులో కంబోడియాకు చెందిన ప్రిన్స్ గ్రూపు వ్యాపారవేత్తపై అభియోగాలు నమోదు చేశారు. క్రిప్టోకరెన్సీ స్కామ్‌కు సూత్రధారిగా వ్యవహరించినట్లు అమెరికా ఆరోపించింది. యూకే, కంబోడియా జాతీయుడు చెన్ జీపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు మోపారు. బిట్‌కాయిన్ బిజినెస్ ద్వారా మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వాస్తవానికి అమెరికా, బ్రిటన్ దేశాలు చెన్కు వ్యాపార అనుమతులు ఇచ్చింది. కానీ అతనికి చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు యూకే ప్రభుత్వం చెప్పింది. లండన్‌లో ఉన్న 19 ప్రాపర్టీలను సీజ్ చేసింది. వాటి విలువ సుమారు 133 మిలియన్ల డాలర్లు ఉంటుంది. క్రిప్టో చరిత్రలో ఇదో పెద్ద ఆర్థిక నేరమని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో బిట్‌కాయిన్ ను సీజ్ చేయడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్ పరారీలో ఉన్నారు. అయితే సైబర్ ఫ్రాడ్ క్రైంలో సూత్రధారి అయిన అతనిపై అమెరికా నిఘా పెట్టింది.
తాజా వార్తలు
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!