తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు
- October 17, 2025
తిరుమల శ్రీవారి లడ్డూ ధరలు పెంచుతున్నారని సోషల్ మీడియా, కొన్ని వార్తా సంస్థలలో ప్రచారం జరుగుతుండటంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. లడ్డూ ధరల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎటువంటి నిర్ణయం టీటీడీ తీసుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు మాట్లాడుతూ, “శ్రీవారి లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీక. దాని ధరను పెంచే ఆలోచన టీటీడీ వద్ద లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు భక్తుల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా చేస్తున్నాయి” అని తెలిపారు.
కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. “టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం” అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. భక్తులు ఈ వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. “తిరుపతి లడ్డూ ధర భవిష్యత్తులో కూడా యథాతథంగానే ఉంటుంది. శ్రీవారి ప్రసాదం ఎప్పటికీ భక్తులందరికీ అందుబాటులో ఉండేలా టీటీడీ కట్టుబడి ఉంటుంది” అని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు
- ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్