దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!

- October 17, 2025 , by Maagulf
దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!

దుబాయ్: డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించి, మోటార్‌బైక్ రైడర్ ప్రాణాలకు ప్రమాదం కలిగించిన తర్వాత దుబాయ్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి జరిమానా విధించారు. ఈ మేరకు చట్టాలను ఉల్లంఘించిన వీడియోను తమ Xలో షేర్ చేశారు.  ఈ వీడియోలో వాహనం నిర్లక్ష్యంగా పలు లేన్‌లను మారుస్తూ, మోటార్‌బైక్‌ను దాదాపుగా ఢీకొట్టింది. డెలివరీ రైడర్ చాకచక్యంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు.

ఈ సందర్భంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ఇది డ్రైవర్ ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.  ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనం నడిపితే Dh2,000 జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు మరియు 60 రోజుల పాటు వాహనాన్ని సీజ్ చేస్తమని పోలీసులు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com