కొత్త ODI జెర్సీ విడుదల

- October 17, 2025 , by Maagulf
కొత్త ODI జెర్సీ విడుదల

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది, కాబట్టి జట్టు కొత్త లుక్‌లో కనిపించడం ప్రేక్షకుల్లో, క్రికెట్ అభిమానులలో భారీ ఆసక్తి కలిగించింది. ప్రతి సిరీస్ ముందు జట్టు కొత్త జెర్సీతో ప్రసిద్ధి చెందడం ఒక రకమైన ట్రెడిషన్, కానీ ఈసారి భారత జట్టు కొత్త డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ కలిగించింది.

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి టీం ఇండియా కొత్త వన్డే జెర్సీని ధరించి కనిపించారు. ఈ జెర్సీ భుజాలపై త్రివర్ణ పతాక ఛాయలు, ముందు భాగంలో కొత్త స్పాన్సర్ లోగో ఉన్నాయి.టీం ఇండియా  జెర్సీకి అపోలో టైర్స్ కొత్త స్పాన్సర్. డ్రీమ్11తో బీసీసీఐ (BCCI) విడిపోయిన తర్వాత, టైర్ల కంపెనీ టీం ఇండియాను సొంతం చేసుకోవడానికి భారీ బిడ్ వేసింది.

అపోలో టైర్స్ BCCIతో రూ. 579 కోట్ల (US$1.7 బిలియన్) విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం 2027 వరకు చెల్లుతుంది. అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు BCCIకి రూ. 4.5 కోట్లు (US$1.7 బిలియన్) చెల్లిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com