సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!

- October 22, 2025 , by Maagulf
సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!

రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు అరెస్టు చేశారు. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) తెలిపింది. ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని అథారిటీ హెచ్చరించింది.  

అరెస్టయిన వారిలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వారితో పాటు అవినీతికి సహకరించిన పౌరులను కూడా అరెస్టు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. అరెస్టయిన వారిలో ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారుడి యాజమాన్యంలోని కంపెనీకి క్రషర్ లైసెన్స్‌ ను చట్టవిరుద్ధంగా మంజూరు చేసి SR1,625,000 మొత్తాన్ని లంచంగా స్వీకరించిన పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ఉద్యోగి ఉన్నారు.  ఒక గవర్నరేట్ మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చట్టవిరుద్ధంగా వాణిజ్య సంస్థకు టెండర్ జారీ చేసి SR195,000 తీసుకున్న వ్యక్తి ఉన్నారని వెల్లడించారు.  వీళ్లతోపాటు పలు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ.. తమ విధులను దుర్వినియోగం చేస్తూ పట్టుబడిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అథారిటీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com