నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- October 22, 2025
మహిళల ప్రీమియర్ లీగ్ ( WPL) విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కన్నా ముందు మెగా వేలాన్ని (WPL auction 2026 ) నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. నవంబర్ 26 లేదా 27 తేదీల్లో ఢిల్లీ వేదికగా వేలాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వేలం తేదీని బీసీసీఐ అఫీషియల్‌గా ప్రకటించనప్పటికి ఆయా తేదీల్లో జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫ్రాంఛైజీలు ఎంత మంది ప్లేయర్లు అట్టిపెట్టుకోవాలి ? రైటు టు మ్యాచ్ ? వంటి వాటి గురించి ఇప్పటికే ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు క్రిక్ ఇన్‌ఫో తెలిపింది.
ఒక్కొ ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అనుమతి ఉంది. ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకునే ప్లేయర్లలో.. తొలి ప్లేయర్‌కు రూ.3.5 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ.1.75 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు కోటీ, ఐదో ప్లేయర్‌కు రూ.50లక్షలు గా నిర్ణయించారు.
ఇక వేలంలో ఫ్రాంఛైజీ పర్స్ వాల్యూను రూ.15 కోట్లుగా నిర్ణయించారు. ఐదుగురిని రిటైన్ చేసుకుంటే పర్స్ వాల్యూ నుంచి 9.75 కోట్లు కట్ అవుతుంది. ఒక్కొ ఫ్రాంఛైజీ గరిష్టంగా 18 మందిని తీసుకోవచ్చు. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 90 మంది ప్లేయర్లు కలిగి ఉండనున్నాయి. ఇక ఫ్రాంఛైజీలు అన్ని తాము అట్టి పెట్టుకునే ప్లేయర్ల జాబితాను నవంబర్ 5లోపు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
బీసీసీఐ ఐదు రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికలను ఆమోదించింది. కానీ ఒక ఫ్రాంచైజీకి అందుబాటులో ఉన్న ఆర్‌టీఎమ్‌ల సంఖ్య అనేది నిలుపుకున్న ఆటగాళ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అట్టిపెట్టుకున్న ప్రతి ఆటగాడికి, ఫ్రాంచైజీ ఒక ఆర్‌టీఎమ్ ఎంపికను కోల్పోతుంది.
ఉదాహరణకు.. ఒక జట్టు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకుంటే వేలంలో ఆర్‌టీఎంను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. మరోవైపు.. ఎటువంటి రిటెన్షన్లు లేకుండా వేలంలోకి వెళ్లే జట్టు ఐదు ఆర్‌టీఎమ్‌లను ఉపయోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్