మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- October 22, 2025
మస్కట్: ఒమన్ విమానాశ్రయాలు ప్రపంచ సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న హువావేతో జతకట్టాయి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ ఇంటెలిజెంట్ క్యాంపస్ షోకేస్‌ను ప్రారంభించాయి. ఇది ఒమన్ విమానయాన రంగంలో పురోగతిని సూచిస్తుందని వక్తలు తెలిపారు. భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మక నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం స్మార్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీలో ఒమన్ విమానాశ్రయాల పురోగతి చాటి చెబుతుందని పేర్కొన్నారు. విమానయాన ఆవిష్కరణలకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ కేంద్రంగా ఒమన్‌ను నిలుపుతుందని తెలిపారు.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 40వేల మంది రోజువారీ ప్రయాణీకులకు వెయిటింగ్ ఏరియాలు మరియు చెక్-ఇన్ జోన్లతో సహా అన్ని సౌకర్యాలలో సురక్షితమైన హై-స్పీడ్ కనెక్టివిటీ ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. దీంతోపాటు అధునాతన నిఘా వ్యవస్థలు మరియు రియల్-టైమ్ డేటా అనలిటిక్స్ సామర్థ్యాల ద్వారా భద్రతా ప్రోటోకాల్‌లను బలోపేతం చేస్తుందని ఒమన్ విమానాశ్రయాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అహ్మద్ అల్ అమ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్