అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!

- October 22, 2025 , by Maagulf
అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!

దోహా: దోహాలోని అల్ రయాన్ రోడ్, సబా అల్-అహ్మద్ కారిడార్ టన్నెల్ (రోడ్ n.950) వద్ద తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ తెలిపింది. సాధారణ నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత ఆంక్షలను విధించినట్లు వెల్లడించింది.

అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల నుండి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అక్టోబర్ 27 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.  వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్నఇతర రోడ్ లేన్‌లను ఉపయోగించాలని సూచించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com