యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!

- October 22, 2025 , by Maagulf
యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!

యూఏఈ: దీపావళి సందర్భంగా యూఏఈలో బంగారు నాణేలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది.  ఈ సంవత్సరం బంగారం ధరలు 50 శాతానికి పైగా పెరిగినప్పటికీ, పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి చిన్న సైజు నాణేలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని ఉందని దుబాయ్‌లోని ఆభరణాల వ్యాపారులు తెలిపారు. చాలా మంది వినియోగదారులు బహుమతి మరియు లక్ష్మీ పూజ కోసం బంగారు కాయిన్ లను కొనడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగ రోజు ఐదు మరియు 10 గ్రాముల నాణేలకు సంబంధించి డిమాండ్ అధికంగా ఉందని మీనా జ్యువెలర్స్ భాగస్వామి సంజయ్ జెత్వానీ అన్నారు.

మరోవైపు దీపావళి సమయంలో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  కానీ పండుగ రోజు ధరలు 4.5 శాతం పడిపోయింది.  ఔన్సుకు $4,381 నుండి $4,142.75 కు తగ్గిందని సిరోయా జ్యువెలర్స్ యజమాని చందు సిరోయా తెలిపారు. దీపావళి సందర్భంగా ప్రజలు పెట్టుబడి కోసం బంగారు నాణేలను కొనుగోలు చేశారని పేర్కొన్నారు.  పండుగ సందర్భంగా ఆభరణాల కంటే నాణేలకు ప్రాధాన్యత ఇచ్చారని, దాంతో బంగారు నాణేలకు డిమాండ్ చాలా బలంగా ఉందని బఫ్లెహ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిరాగ్ వోరా తెలిపారు. ముఖ్యంగా ధన్ తేరాస్ తోపాటు దీపావళి కి ముందు బంగారు నాణేల కొనుగోళ్లలో తాము పెరుగుదలను చూశామని వెల్లడించారు.   

కాగా, దీపావళి మరియు ధంతేరాస్ సమయంలో బంగారు నాణేలకు బలమైన డిమాండ్ ఉంటుందని తాము ముందుగానే ఊహించామని , అందుకు తగినట్టుగా ప్రతి కస్టమర్ అవసరాలను సజావుగా బంగారాన్ని అందించగలిగామని మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్‌లాల్ అహ్మద్ వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com