యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- October 22, 2025
యూఏఈ: దీపావళి సందర్భంగా యూఏఈలో బంగారు నాణేలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. ఈ సంవత్సరం బంగారం ధరలు 50 శాతానికి పైగా పెరిగినప్పటికీ, పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి చిన్న సైజు నాణేలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని ఉందని దుబాయ్‌లోని ఆభరణాల వ్యాపారులు తెలిపారు. చాలా మంది వినియోగదారులు బహుమతి మరియు లక్ష్మీ పూజ కోసం బంగారు కాయిన్ లను కొనడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగ రోజు ఐదు మరియు 10 గ్రాముల నాణేలకు సంబంధించి డిమాండ్ అధికంగా ఉందని మీనా జ్యువెలర్స్ భాగస్వామి సంజయ్ జెత్వానీ అన్నారు.
మరోవైపు దీపావళి సమయంలో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ పండుగ రోజు ధరలు 4.5 శాతం పడిపోయింది. ఔన్సుకు $4,381 నుండి $4,142.75 కు తగ్గిందని సిరోయా జ్యువెలర్స్ యజమాని చందు సిరోయా తెలిపారు. దీపావళి సందర్భంగా ప్రజలు పెట్టుబడి కోసం బంగారు నాణేలను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఆభరణాల కంటే నాణేలకు ప్రాధాన్యత ఇచ్చారని, దాంతో బంగారు నాణేలకు డిమాండ్ చాలా బలంగా ఉందని బఫ్లెహ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిరాగ్ వోరా తెలిపారు. ముఖ్యంగా ధన్ తేరాస్ తోపాటు దీపావళి కి ముందు బంగారు నాణేల కొనుగోళ్లలో తాము పెరుగుదలను చూశామని వెల్లడించారు.
కాగా, దీపావళి మరియు ధంతేరాస్ సమయంలో బంగారు నాణేలకు బలమైన డిమాండ్ ఉంటుందని తాము ముందుగానే ఊహించామని , అందుకు తగినట్టుగా ప్రతి కస్టమర్ అవసరాలను సజావుగా బంగారాన్ని అందించగలిగామని మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్‌లాల్ అహ్మద్ వెల్లడించారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్