మే 19వ తేదీ విమానం.. గాల్లోనే రెండు ముక్కలు!
- July 22, 2016
విమానం గాల్లో ఉండగానే దానికి మంటలు అంటుకుని.. రెండు ముక్కలైపోయింది! అవును.. రెండు నెలల క్రితం కూలిపోయిన ఈజిప్షియన్ ఎయిర్ లైన్స్ విమానం గురించిన ఈ దిగ్భ్రాంతికర వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్ పిట్ సమీపంలో లేదా లోపల మంటలు చెలరేగడంతో.. విమానం గాల్లో ఉండగానే రెండు ముక్కలై మధ్యధరా సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఈజిప్టు విచారణాధికారుల బృందం చెప్పింది. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. విమానంలో సాంకేతిక లోపం వల్ల వచ్చాయా, లేక ఏదైనా విద్రోహ చర్య అందుకు కారణమా అనేది తెలియాల్సి ఉంది.ఎయిర్ బస్ ఎ320 రకానికి చెందిన ఈ విమానం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను వెల్లడించారు. మే 19వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 66 మందీ మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







