ఉచిత మొబైల్ రెమిటెన్స్ యాప్ 'తాత్కాలికంగా' నిలిపివేత..!!

- October 23, 2025 , by Maagulf
ఉచిత మొబైల్ రెమిటెన్స్ యాప్ \'తాత్కాలికంగా\' నిలిపివేత..!!

యూఏఈ: అంతర్జాతీయ పీర్-టు-పీర్ రెమిటెన్స్ కంపెనీగా పేరుగాంచిన టాప్‌టాప్ సెండ్ దాదాపు వారం రోజులుగా పనిచేయడం లేదు. సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా సేవలు నిలిపివేయబడుతున్నాయని పేర్కొంటూ ఈ మొబైల్ రెమిటెన్స్ యాప్ తాత్కాలికంగా ఆపరేషన్‌ను నిలిపివేసింది.

టాప్‌టాప్ సెండ్ దాదాపు వారం రోజులుగా పనిచేయడం లేదని రెమిటెన్స్ యాప్‌ను రెగ్యులర్ గా ఉపయోగించే ప్రవాసులు తెలియజేశారు. వినియోగదారులు యాప్‌ను తెరిచినప్పుడు, ఒక నోటిఫికేషన్ పాప్ అప్ అవుతుందని తెలిపారు. " తాత్కాలికంగా యాప్ అందుబాటులో లేదు. మేము మా సేవను అప్‌గ్రేడ్ చేస్తున్నాము. యూఏఈ నుండి బదిలీలను తాత్కాలికంగా పాజ్ చేసాము. వీలైనంత త్వరగా మా తక్కువ ధర, వేగవంతమైన బదిలీ సేవను తిరిగి ప్రారంభించాలని మేము ఎదురుచూస్తున్నాము." అని అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై యాప్ నిర్వాహణ కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.       

స్వదేశాలకు డబ్బు పంపడం అది యూఏఈలో ఒక పెద్ద వ్యాపారం.  అమెరికా మరియు సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద రెమిటెన్స్‌లను పంపే దేశం యూఏఈ. గత సంవత్సరం, యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు భారతదేశానికి 21.6 బిలియన్ల డాలర్లను పంపారు.  ఇది మొత్తం డాలర్ ఇన్‌ఫ్లోలలో 19.2 శాతానికి సమానం. 2024లో, యూఏఈలోని ఫిలిప్పీన్స్ కార్మికులు ఫిలిప్పీన్స్‌కు దాదాపు 1.52 బిలియన్ల డాలర్లను పంపారని స్టాటిస్టా తన అనలైజ్ నివేదికలో తెలిపింది.

మరోవైపు, నివాసితులు రెమిటెన్స్ సమస్యలను ఎదుర్కోవడం ఈ సంవత్సరం ఇదే మొదటిసారి కాదు. జూలైలో రోజుల తరబడి లావాదేవీలు ఆలస్యం అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కాగా, టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా లావాదేవీలు ఆలస్యం అయ్యాయని వివరణ ఇచ్చింది. దాందోపాటు ప్రభావితమైన కస్టమర్లకు Dh20 నుండి Dh60 వరకు క్యాష్‌బ్యాక్ వోచర్‌లను అందించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com