ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!

- October 23, 2025 , by Maagulf
ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!

పోర్ట్ సెయిడ్: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి వీలుగా ఖతార్ కు చెందిన హ్యుమటేరియన్ షిప్‌మెంట్‌ ఈజిప్ట్‌ లోని పోర్ట్ సెయిడ్‌కు చేరుకుంది.  ఈ మేరకు ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్ (QFFD)  తెలిపింది. ఈ షిప్‌మెంట్‌లో ఖతార్ ఛారిటీ మరియు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) అందించిన 29,200 షెల్టర్ టెంట్లు, ఇతర అత్యవసర సామగ్రి ఉన్నాయని తెలిపింది. ఇళ్లను కోల్పోయిన పదివేల కుటుంబాలకు ఇవి గౌరవప్రదమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయని పేర్కొంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com