హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!

- October 23, 2025 , by Maagulf
హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!

కువైట్: కౌన్సెలర్ నాజర్ అల్-హైద్ నేతృత్వంలోని అప్పీల్ కోర్టు, గతంలో ఒక తండ్రి మరియు అతని కొడుకుపై విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసింది. అదే సమయంలో  వారికి 10,000 కువైట్ దినార్ల జరిమానా విధించింది. కాగా, వారి రెండవ కుమారుడిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని కోర్టు సమర్థించింది.

 ఒక సూడాన్ కాంట్రాక్టర్ మరియు ఒక భారతీయ కాంట్రాక్టర్‌కు ఒక్కొక్కరికి 3,000 దినార్ల జరిమానా విధించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని ఆరోపణల నుండి ఇద్దరు ప్రవాస కంపెనీ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 60 మందికి పైగా ప్రవాస నర్సులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. నిందితులు తమను సూడాన్ మరియు భారత్ నుండి తీసుకువచ్చారని, మంత్రిత్వ శాఖ నియమించిన తర్వాత తమ జీతాలలో కొంత భాగాన్ని కంపెనీ యజమానులకు చెల్లించాలని ఖాళీ పేపర్లపై సంతకాలు చేయమని బలవంతం చేశారని నర్సులు ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com