అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- October 23, 2025
రియాద్: అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా నాలుగు కొత్త ఎలక్ట్రానిక్ పౌర వ్యవహారాల సేవలను సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రారంభ వేడుకలు అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. రియాద్లోని మంత్రిత్వ శాఖ క్లబ్లో అంతర్గత మంత్రిత్వ శాఖ పౌర వ్యవహారాల ఏజెన్సీ పర్యవేక్షకుడు మేజర్ జనరల్ సలేహ్ అల్-మురబ్బా సేవలను ప్రారంభించారు.
అమల్లోకి వచ్చిన కొత్త సేవల్లో పౌరుడి ఫస్ట్ నేమ్ ను మార్చడం, డెత్ సర్టిఫికేట్ల డెలివరీ, పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న డెత్ సర్టిఫికేట్లకు ప్రత్యామ్నాయాలను జారీ చేయడం మరియు బర్త్ సర్టిఫికేట్లను అప్డేట్ చేయడం వంటి సేవలు ఉన్నాయి. పౌరులు మరియు నివాసితులకు స్మార్ట్ పరిష్కారాలను అందించడానికి, వారి విలువైన సమయాన్ని ఆదా చేయడానికి మరియు పౌర వ్యవహారాల సేవల నాణ్యతను పెంచడానికి డిజిటల్ మార్గం ద్వారా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా కొత్త సేవలను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!
- ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- ఉచిత మొబైల్ రెమిటెన్స్ యాప్ 'తాత్కాలికంగా' నిలిపివేత..!!