దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్

- October 23, 2025 , by Maagulf
దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్

దుబాయ్: విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ లో మూడవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్నారు.దుబాయ్ లీమెరిడియన్ హోటల్‌లో సాయంత్రం 6.30 గంటలకు APNRTS ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

యూఏఈలోని తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే వేలాది మంది రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు.యూఏఈతో పాటు కువైట్‌, సౌదీ అరేబియా, ఒమాన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌ వంటి దేశాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు రానున్నారు. నిర్వాహకుల అంచనా ప్రకారం 2 వేల మందికి పైగా తెలుగు ప్రజలు ఈ డయాస్పొరా మీటింగ్‌లో పాల్గొననున్నారు.

యూఏఈలోని వివిధ ఎమిరేట్స్‌ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని బృందాలుగా హాజరుకానున్నారు. విదేశీ పర్యటనల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి తెలుగు ప్రజలతో చర్చలు జరిపి, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్రను ప్రోత్సహించే విధంగా సీఎం చంద్రబాబు డయాస్పొరా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

గతంలో సింగపూర్‌లో జరిగిన తెలుగు డయాస్పొరా మీటింగ్‌కు 2000 మంది హాజరైనట్లు గుర్తుచేస్తూ, యూఏఈ సమావేశానికి మరింత పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని APNRTS అంచనా వేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com