అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- October 24, 2025
విజయవాడ: దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్ ముందుందని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. పూర్వోదయ పధకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖపట్నం గ్రోత్ హబ్, పూర్వోదయ పధకాల పై గురువారం ఎపి సచివాలయంలో నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తో సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మ ణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగాపోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. అదే విధంగా రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పధకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్ధం చేసుకోవాలని సిఎస్ విజయానందు ఆయన సూచించారు.
అనంతరం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయా నంద్ మాట్లాడుతూ విశాఖపట్నం (vishsakapatnam) గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యే కంగా ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవతంగా ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు అనేక నూతన ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు, పధకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయడం జరుగుతోందని కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు అయ్యేలా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యంకు విజ్ఞప్తి చేశారు.
కాగా పూర్వోదయ అనేది దేశ తూర్పతీరంలోని ఆంద్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక వినూత్న పధకం. ఇది సాంస్కృతిక వారసత్వం మరియు సహజ వనరులను ఉపయోగించుకోవడం, కొత్త మోలిక సదుపాయాలను సృష్టించడం, ఉపాధిని సృష్టించడం మరియు స్థిరమైన ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం ద్వారా తూర్పు భారతదేశాన్ని జాతీయ పురోగతికి కీలకమైన చోదకంగా మార్చాలనే లక్ష ్యంతో పూర్వోదయ పధకాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పెద్దఎత్తున విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన మోలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







