ఎస్‌డీఎఫ్ అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నా ఐసిస్
- July 23, 2016
ఐసిస్ ఉగ్రభూతం సిరియా వాసులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇటీవల టర్కీ - రఖా మధ్యలో వ్యూహాత్మక ప్రాంతమైన మన్‌బిజ్ వద్ద డజన్ల కొద్దీ పౌరులను సంకీర్ణ దళాలు హతమార్చినట్లు ఆరోపణలు రావడంపై వారు వివరణ ఇచ్చారు.
ఇటీవల మన్‌బిజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో 11 మంది పిల్లలతో సహా 56మంది పౌరులు మృతిచెందినట్లు బ్రిటన్‌కు చెందిన ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆరోపించింది. దీంతో సంకీర్ణ దళాలు దీనిపై విచారణ చేపట్టాయి. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్(ఎస్‌డీఎఫ్) కాల్పులను అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నాయని తేలినట్లు కల్నల్ క్రిస్ గార్వెర్ తెలిపారు. మంగళవారం భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఎస్‌డీఎఫ్ దళాలకు ఎదురుపడ్డారన్నారు. వారు దాడికి సిద్ధమవుతుండటంతో ఎస్‌డీఎఫ్ దళాలు వారు ఉంటున్న భవనాలు, వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశాయి. అనంతరం అక్కడి పరిస్థితినిబట్టి ఉగ్రవాదులు పౌరులతో కలిసిపోయి దాడికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామని గార్వెర్ తెలిపారు
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









