భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!

- October 26, 2025 , by Maagulf
భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!

దమ్మామ్ః  ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలో ఒక భారతీయ ప్రవాసి ఒకరు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు, తనకు సాయం చేయాలని కోరారు. అయితే, సదరు వీడియోలో పేర్కొన్న విధంగా సదరు వ్యక్తి వాదనలను తూర్పు ప్రావిన్స్ పోలీసులు ఖండించారు. ఆ వ్యక్తిని విచారణ కోసం పిలిపించామని, తన సోషల్ మీడియా అకౌంట్లో వీక్షణలను పెంచుకోవడానికే ఆ వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేసినట్టు నిర్ధారించామని పోలీసులు తెలిపారు. ప్రవాసియునికి మరియు అతని యజమానికి మధ్య ఎటువంటి వివాదం లేదని అధికారులు అన్నారు. సంబంధిత అధికారుల సమన్వయంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com