యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- October 26, 2025
యూఏఈ: యూఏఈలో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) అప్లికేషన్ల డౌన్ లోడ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. గత ఐదున్నర సంవత్సరాలలో యూఏఈలో VPN ల డౌన్ లోడ్లు 65.78 శాతం పెరిగిందని సైబర్‌న్యూస్ తెలిపింది. యూఏఈ తర్వాత ఖతార్ 55.43 శాతం, సింగపూర్ 38.23 శాతం, నౌరు 35.49 శాతం, ఒమన్ 31 శాతం, సౌదీ అరేబియా 28.93 శాతం, నెదర్లాండ్స్ 21.77 శాతం, యూకే 19.63 శాతం, కువైట్ 17.88 శాతంమరియు లక్సెంబర్గ్ 17.3 శాతం ఉన్నాయని తెలిపింది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే యూఏఈలో 6.11 మిలియన్ VPN యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారు. 2024లో 9.2 మిలియన్లు, 2023లో 7.81 మిలియన్లు మరియు 2022లో 6.54 మిలియన్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే వేగం కొనసాగితే, ఈ సంవత్సరం డౌన్లోడ్లు గత సంవత్సరం గణాంకాలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.
ఇక VPN వినియోగంలో నిరంతర పెరుగుదల యూఏఈ జనాభా పెరుగుదలతో సమానంగా ఉంది. ఇది వరల్డ్‌మీటర్ డేటా ప్రకారం రికార్డు స్థాయిలో 11.44 మిలియన్లకు చేరుకుంది. అయితే, యూఏఈలో VPN యాప్‌లను ఉపయోగించడానికి అనుమతి ఉంది. కానీ వాటిని దుర్వినియోగం చేసేవారికి కేసుల తీవ్రతను బట్టి 5లక్షల నుండి 2 మిలియన్ల దిర్హమ్స్ వరకు జరిమానా, జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







