ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!

- October 26, 2025 , by Maagulf
ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!

మస్కట్: ఒమన్ లో జాతీయ డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం 36 ప్రాజెక్టులలో 25 డిజిటల్ కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు  100 శాతం పూర్తియినట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ప్రకటించింది. మిగిలిన 11 ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయని, ఇవి 80 శాతం పూర్తి అయినట్లు పేర్కొంది.

ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం,  ఇ-ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం మరియు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా సేవలను వేగవంతంగా అందిచడానికి వీలవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

100 శాతం పూర్తయిన ప్రాజెక్టులలో యూనిఫైడ్ ప్రభుత్వ సేవల పోర్టల్ మరియు యూనిఫైడ్ నకల్ (మొబైల్) అప్లికేషన్ ఉన్నాయి.  ఇవి బహుళ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సేవలకు అనుకూలమైన డిజిటల్ గేట్‌వేగా పనిచేస్తుందని MTCITలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు సెక్టోరల్ ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ జనరల్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ అల్ ఖరౌసి తెలిపారు.  ఈ కార్యక్రమాల పూర్తి ఒమన్ డిజిటల్ ప్రభుత్వ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తహావుల్ ప్రోగ్రామ్ నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com