ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!

- October 27, 2025 , by Maagulf
ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!

మనామాః బహ్రెయిన్ ప్రపంచ ప్రముఖ పర్యాటక దేశాలలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఆతిథ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ఆకర్షిస్తుంది. బహ్రెయిన్ పర్యాటక రంగం విజయంలో ఆతిథ్య పరిశ్రమ కీలక భాగస్వామి అని, పర్యాటక వ్యూహం 2022–2026 లక్ష్యాలను సాధించడంలో చురుకైన పాత్ర పోషిస్తుందని పర్యాటక మంత్రి హర్ ఎక్సలెన్సీ ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ స్పష్టం చేశారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బహ్రెయిన్ ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతుందని తెలిపారు. ఆతిథ్య రంగ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 
ఈ సంవత్సరం పర్యాటక రంగం పనితీరుకు సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు. జాతీయ పర్యాటక పర్యావరణ వ్యవస్థలో ఆతిథ్యం ఒక కీలకమైన అంశం అని వివరించారు.మంత్రిత్వ మరియు హోటళ్ల యజమానుల మధ్య సన్నిహిత భాగస్వామ్యం సేవల నాణ్యతను పెంచడానికి దోహదం చేస్తుందని తెలిపారు.ఈ సంవత్సరం గతంలో కంటే మరింత వైవిధ్యమైన పర్యాటక అనుభవాలతో వస్తుందని, త్వరలోనే పూర్తి క్యాలెండర్‌ను  విడుదల చేస్తామని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com