అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- October 27, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ, తుఫాను ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రతి ఒక్కదాంట్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర అవసరాలు లేదా సమాచారం కోసం ఈ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. హోంమంత్రి వివరించిన ప్రకారం, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు.
అలాగే సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. అదనంగా, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బందిని కూడా అండగా నిలపాలని సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అనిత స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు బృందాలను పంపిస్తామని కూడా తెలిపారు
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







