జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు

- October 27, 2025 , by Maagulf
జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు

న్యూ ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్(CJI) సూర్యకాంత్ నియామక ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్(B.R.Gavai) తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సూచించారు. ఈ సిఫారసుతో ఆయన నియామకానికి మార్గం సాఫీ అయ్యింది.

జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనుండగా, తదుపరి రోజు నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు సీనియారిటీ ఆధారంగా సీజేఐ నియామకం జరిగే సంప్రదాయం ప్రకారం ఈ ఎంపిక జరిగింది.

1962 ఫిబ్రవరి 10న హర్యానాలో జన్మించిన సూర్యకాంత్,(CJI)హిసార్ ప్రభుత్వ పీజీ కళాశాల నుంచి డిగ్రీ, మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీస్ ప్రారంభించి, 1985లో చండీగఢ్‌కు మారి పంజాబ్–హర్యానా హైకోర్టులో వాదనలు ప్రారంభించారు.

2000లో హర్యానా రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులై గుర్తింపు పొందారు. 2004లో పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. త్వరలోనే ఆయన నియామకంపై అధికారిక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com