తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- October 28, 2025
అమరావతి: ఏపీని మొంథా తుఫాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 17కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 370 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మొంథా తుఫాను ప్రభావం సుమారు 18గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రికి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయి. 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బుధవారం కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రెడ్ అలర్ట్ జారీకాగా.. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు పొంచి ఉంది.
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మొంథా తుపాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది.
తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ విజయవాడ డివిజన్ అధికారులకు సూచించారు. రైలు పట్టాలు, వంతెనల వద్ద భద్రత పెంచాలని, ఆపరేటింగ్, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాక్ లు, బ్రిడ్జీలను నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ఆహార పదార్థాలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







