కాకిని పోలిన గెటప్‌లో అక్షయ్!

- July 23, 2016 , by Maagulf
కాకిని పోలిన గెటప్‌లో  అక్షయ్!

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో 2.0' రజనీకాంత్ తో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తలపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన గెటప్ కి సంబంధించిన ఒక స్టిల్ బయటికి వచ్చింది. నల్లటి దుస్తుల్లో కాకిని పోలిన గెటప్‌లో ఉన్నారు అక్షయ్. ఈ సినిమాలో ఆయన ఒక అబ్సెషన్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఇదే అంశాన్ని అక్షయ్ కుమార్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన పెద్దగా నవ్వేశారు. ఈ వార్త తనకి కొత్తగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ గెటప్ లో తాను ఒక హోటల్ కి వెళ్లానని.. ఎవరూ తనని విచిత్రంగా చూడలేదని చెప్పుకొచ్చారు. ఆ గెటప్‌లో తననెవరూ గుర్తుపట్టలేదని తెలిపారు. ఈ రోల్ కోసం తనకి మేకప్ వేయడానికి 6 గంటలు పట్టేదని చెప్పారు. తన పాత్ర కొత్తగా .. ఊహించలేని విధంగా ఉంటుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com