అనూకృతితో జేడీ పెళ్లి..
- July 23, 2016
తెలుగు ఇండస్ట్రీలో శివ చిత్రంలో నాగార్జునతో కాలేజ్ లో ఫైట్ చేసే యంగ్ విలన్ ఎవరో అందరికీ గుర్తుంది కాదా..! అదే విలన్ కొంత కాలం తర్వాత నాగార్జున తనయుడు నాగచైతన్యతో కూడా జోష్ చిత్రంలో గొడవ పడతాడు ఇంతకీ ఆ విలన్ ఎవరా అనుకుంటున్నారా..! ఆయన విలన్ గా , హీరోగా కూడా ఎన్నో సినిమాల్లో అలరించాడు. ఇంతకీ ఎవరా విలన్ కమ్ హీరో అనుకుంటున్నారా..! జెడీ చక్రవర్తి. నటుడుగా, దర్శకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించిన హీరో జేడీ చక్రవర్తి చాలా కాలంగా బ్యాచ్ లర్ గానే ఉంటున్నారు. అయితే ఆ మద్య ఓ ఢిల్లీ అమ్మాయితో మనోడి పెళ్లి అవుతుందని వార్తలు వచ్చినా తర్వాత అది కాస్త క్యాన్సల్ అయ్యింది.ఈ మద్య వెండి తెరకు చాలా దూరంగా ఉంటున్న జెడీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఈ వార్త స్పెషల్ ఏంటంటే జేడీ చక్రవర్తి పెళ్లి కొడుకు కాబోతున్నాడు. అవును ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరా అనుకుంటున్నారా..! జేడీ చక్రవర్తి గురువు ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి రాంగోపాల్ వర్మ చిత్రంలో నటించిన శ్రీదేవి హీరోయిన్ అనుకృతి. అయితే ఈ అమ్మడు పాప చిత్రంలో నటిస్తుంది.అయితే ఈ మద్య ఆ చిత్ర దర్శకుడు బూతు కాంటెంట్ లో నటించాలని ఆమె పై వత్తిడి తెచ్చినట్లు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పెద్ద రగడ అయ్యింది. అయితే దీని వెనుక ఉన్నది జేడి అని తెలుస్తుంది. అంతే కాదు పాప దర్శకుడిపై కేసు పెడతానని కూడా అంటున్నాడు. మొత్తానికి ఈ ముదురు హీరోని బాగానే లైన్లో పడేసింది అనూకృతి..త్వరలో పెళ్లి పీటలపై చూడాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









