యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ లో రియాద్, మదీనా..!!
- November 01, 2025
రియాద్: యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ లో రియాద్, మదీనా సిటీలు చేరాయి. ఈ మేరకు సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ వెల్లడించారు. రియాద్ డిజైన్ విభాగంలో నెట్‌వర్క్‌లో చేరగా, మదీనా కలినరీ కళలకు గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత సృజనాత్మక మరియు వినూత్న నగరాల్లో సౌదీ అరేబియా ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
రియాద్ యొక్క డైనమిక్ డిజైన్ ల్యాండ్‌స్కేప్ లకు నిలయంగా ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కమిషన్ సీఈఓ డాక్టర్ సుమయా అల్-సులైమాన్ తెలిపారు. ఈ గుర్తింపు జాతీయ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ స్ట్రాటజీ ఫలితమని చెప్పారు. ఇది రాబోయే రోజుల్లో ఆవిష్కరణలను పెంపొందిస్తుందని, సౌదీ ప్రతిభను శక్తివంతం చేస్తుందన్నారు.
యునెస్కో మదీనాను క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా చేర్చినట్లు ప్రకటించింది. ఇది బురైదా తర్వాత ఈ రంగంలో గుర్తింపు పొందిన రెండవ సౌదీ నగరంగా నిలిచింది. ఈ నగరం తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధి చెందిందని పేర్కొంది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో ఇప్పటికే సౌదీ అరేబియాకు చెందిన అల్-అహ్సా , బురైదా, తైఫ్ నగరాలు చోటు పొందాయి.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







