మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!

- November 03, 2025 , by Maagulf
మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!

దోహా: ఖతార్ లో అందరికి సుపరిచితమైన మెట్రాష్ యాప్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పౌరులు మరియు నివాసితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన జరిమానాలు చెల్లించడానికి వీలు కల్పించింది.  నవంబర్ 2 నుండి ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీనిని ఖతార్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత మంత్రిత్వ శాఖలోని వెర్డిక్ట్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.  

ఈ కొత్త ఫీచర్ తో కలిపి మెట్రాష్ అప్లికేషన్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య 400 దాటింది.  వినియోగదారులకు సురక్షితమైన మరియు ఎన్‌క్రిప్టెడ్ సేవలను అందిస్తున్నట్లు మెట్రాష్ యాప్ ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com