ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!

- November 03, 2025 , by Maagulf
ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!

మస్కట్: ఆహార భద్రతను బలోపేతం చేయనున్నట్లు ఒమన్ ప్రకటించింది. ఈ మేరకు జాతీయస్థాయిలో డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా అల్ దహిరా గవర్నరేట్‌లోని పలు వ్యూహాత్మక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడడంతోపాటు స్థానిక మరియు గల్ఫ్ మార్కెట్‌లకు అధిక-నాణ్యత ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

"ఒమన్ విజన్ 2040" లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందినట్లు అల్ దహిరా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్‌లోని యానిమల్ వెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ బిన్ అలీ అల్ షాండౌడి నివేదిక తెలిపింది. ఆహార భద్రతను మెరుగుపరచడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందకు చేపట్టిన ప్రయత్నాలలో ఇది భాగమన్నారు. ఇందులో భాగంగా ఐదు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఏడు ఇన్వెస్ట్ మెంట్ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు, వీటి విలువ సుమారు OMR35 మిలియన్లు ఉంటుందని తెలిపారు. "గల్ఫ్ ఇంటర్నేషనల్ పౌల్ట్రీ ఫామ్" ప్రాజెక్ట్‌ ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటిగా అల్ షాండౌడి వెల్లడించారు.

దేశీయ మరియు గల్ఫ్ మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ గుడ్ల ఉత్పత్తిపై దృష్టి పెడుతుందన్నారు.  అలాగే OMR1.35 మిలియన్లతో మేకల ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రారంభినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల ద్వారా ఒమానీ జాతీయులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com