రోగనిరోధకశక్తిని పెంచె పెరుగు
- July 23, 2016
పెరుగూ, పాలూ తీసుకోవడానికి ఆసక్తి చూపించరు కొందరు. దానివల్ల బరువు పెరుగుతామనే అభిప్రాయంలో ఉంటారు. కానీ పిల్లలకు పెరుగు ఎలా అవసరం అవుతుందో మనకూ అంతే. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది మరి. అదెలాగంటే..
జీ ర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి. పైగా మనం తీసుకునే ఇతర పదార్థాల నుంచి పోషకాలనూ శరీరం స్వీకరిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్‌ఫెక్షన్లు కూడా అదుపులో ఉంటాయి.
*
పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్ ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
*
ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకూ, పళ్లకూ మేలుచేస్తుంది. పెరుగులో ఫాస్పరస్ కూడా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులూ, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.
*
కొన్ని సందర్భాల్లో చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కప్పు పెరుగు తిని చూడండి. అది ఒత్తిడిని చాలా సులువుగా తగ్గిస్తుంది. మానసిక సాంత్వననూ అందిస్తుంది. అలాగే అధికబరువునూ తగ్గిస్తుంది పెరుగు.
*
ప్రతిరోజూ పెరుగు తీసుకునేవారిలో గుండె సంబంధ సమస్యలు చాలామటుకూ అదుపులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అధికరక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







