పెరుగు రొయ్యల కూర
- July 23, 2016
కావలసిన పదార్దాలు :
పచ్చిరొయ్యలు : అరకేజి పెరుగు : అర కప్పు మసాలా పొడి : అర టీ స్పూన్ పచ్చిమిర్చి : మూడు ఉల్లి ముక్కలు : అర కప్పు టమాటా : ఒకటి ఉప్పు : తగినంత కారం :టీ స్పూన్ పసుపు : కొద్దిగా నూనె : అర కప్పు గసగసాలు : టీ స్పూన్ కరివేపాకు : కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టూ : టీ స్పూన్ కొత్తిమీర : కట్ట కొబ్బరిపొడి : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి. 2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి. 3) అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి. 4) ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. 5) ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి. 6) ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి. 7) దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి. అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







