'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- November 05, 2025
అమెరికా: తానా సాహిత్యవిభాగం "తానా ప్రపంచసాహిత్య వేదిక" ఆధ్వర్యంలో బాలల దినోత్సవం (నవంబర్14) సందర్భంగా అంతర్జాతీయ “బాల సాహిత్యభేరి”. విశ్వవ్యాప్తంగా ఉన్న బాలసాహితీవేత్తలకు ఆహ్వానం."బాల సాహిత్య భేరి" పేరుతో నవంబర్ 30, 2025 వ తేదీన అంతర్జాతీయ అంతర్జాల శతాధిక బాలకవుల సమ్మేళనం నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో విశ్వవ్యాప్తంగా ఉన్న బాల, బాలికలు "కథ, వచన కవిత, గేయం, పద్యం" విభాగాలలో తమ స్వీయ రచనలను వినిపించాలి. ఒక్కొక్కరికి 3 ని.ల సమయం కేటాయించాము.
5 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న బాల, బాలికలు పైన తెలిపిన విభాగాల్లో ఏదో ఒక విభాగానికి సంబంధించిన తాము రచించిన అంశాలను ఒక పేజీకి మించకుండా వ్రాసి పేరు, ఊరు, తరగతి, దేశం, ఫోన్ # మొదలైన వివరాలను +919121081595 వాట్సాప్ నంబర్ కు గడువుతేదీ నవంబర్ 14లోపు పంపవలెను.
ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 30 న జరిగే తానా అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు, 13 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగే ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనే బాల, బాలికలకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







