చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు..
- July 23, 2016
చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు, వరదతో అతలాకుతలం అవుతుంది. ఈ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 114కు పెరిగింది. అలాగే 111 మంది గల్లంతు అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా దాదాపు 52,900 ఇళ్లు కుప్పకూలాయని... అలాగే 15,5000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సైనికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. దాదాపు 1200 మంది ప్రజల సహకారంతో సహాయక చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితిని అంచనా వేసేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు విశదీకరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







