ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!

- November 06, 2025 , by Maagulf
ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!

మస్కట్: ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు వృద్ధి, నూతన ఆవిష్కరణలను పెంపొందించడానికి సహకార ప్రయత్నాలను కొనసాగించాలని  ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, స్పెయిన్ కింగ్ ఫెలిపే VI పిలుపునిచ్చారు. సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్పెయిన్ లో నవంబర్ 3 నుండి 5 వరకు పర్యటించారు. తన అధికారిక పర్యటనలో భాగంగా స్పెయిన్ కింగ్ ఫెలిపేతో అధికారికంగా చర్చలు జరిపారు. అనంతరం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు.

సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ పెరెజ్-కాస్టెజోన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  గాజాలో తాజా పరిణామాలపై చర్చించారు.  యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, ఖతార్ మరియు టర్కీ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను అభినిందించారు.        

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలపై, ఆర్థిక భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సహకారం కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  ఈ పర్యటనలో అధికారిక పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం పరస్పర వీసా మినహాయింపు ఒప్పందం కుదిరింది. అలాగే, సాంస్కృతిక మరియు క్రీడా సహకారం, పెట్టుబడుల ప్రమోషన్, నీటి వనరుల నిర్వహణ, రవాణా మరియు వ్యవసాయ అభివృద్ధి వంటి అనేక రంగాలలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.  ముఖ్యంగా తయారీ, మైనింగ్, పర్యాటకం, ఏఐ, అంతరిక్ష సాంకేతికత వంటి కీలకమైన రంగాలలో సహకార అవకాశాలను పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com