ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!

- November 06, 2025 , by Maagulf
ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!

దోహా: ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఈ మార్కెట్లు అల్ ఖోర్, అల్ తఖిరా, అల్ వక్రా, అల్ షమల్ మరియు అల్ షహానియాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయ. ఇక అల్ మజ్రౌహ్ మార్కెట్ ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వీటిని వ్యవసాయ వ్యవహారాల శాఖ, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.   

స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మద్దతు ఇవ్వడం మరియు రైతులు,  కస్టమర్ల మధ్య వారధిగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన వెజిటేబుల్స్ ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ మార్కెట్లు ప్రతి గురువారం, శుక్రవారం మరియు శనివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరిచి ఉంటాయని సంబంధిత శాఖల అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com