హీరో విరాట్ కర్ణ పై 'ఓం వీర నాగ' సాంగ్ షూటింగ్

- November 07, 2025 , by Maagulf
హీరో విరాట్ కర్ణ పై \'ఓం వీర నాగ\' సాంగ్ షూటింగ్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు.

నాగబంధం ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యసీవ్ సినిమాటిక్ జర్నీ. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా వుంటాయి.

బడ్జెట్ పరిమితులూ లేకుండా, ప్రేక్షకులను అబ్బురపరిచే సెట్‌లు, విజువల్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు భారతీయ సినీ తెరపై చూడని రీతిలో ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు నాగబంధం సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణగా నిలవనున్న డివోషనల్ సాంగ్ “ఓం వీర నాగ” ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యద్భుతంగా నిర్మించిన శివాలయ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ అద్భుతంగా రూపుదిద్దారు.  అభే & జునైద్ కుమార్ గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ ఇచ్చారు, శ్రీ హర్ష లిరిక్స్ రాశారు. పాపులర్ బాలీవుడ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కార్తీక మాసంలో చిత్రీకరించడం ఆధ్యాత్మికతకు మరింత వైభవం జోడించింది.

సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న “నాగబంధం” అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో వుంటుంది.  

ఈ చిత్రానికి సౌందర్ రాజన్ S  సినిమాటోగ్రఫీ,  ఆర్ సి ప్రణవ్ ఎడిటర్.

నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ త్వరలో ప్రారంభం కానున్నాయి.

తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, జగపతి బాబ్, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్, తదితరులున్నారు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
CEO: వాసు పోతిని
PRO : వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com