తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- November 08, 2025
దోహా: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు దోహాలోని సీ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఫోకస్ మెడికల్ సెంటర్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం (Free Medical Camp) విశేష విజయాన్ని సాధించింది. ఉదయం నుంచే కార్మికులు బారులుగా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు పొందడం వంటి దృశ్యాలు హృదయాన్ని హత్తుకున్నాయి. సుమారు 300 మందికి పైగా తెలుగు కార్మికులు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధిపొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత రాయబారి కార్యాలయ మొదటి మరియు ICBF కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ ఇష్ సింగాలు మాట్లాడుతూ...“తెలంగాణ గల్ఫ్ సమితి చేసే సేవా కార్యక్రమాలు నిజంగా ప్రేరణాత్మకమైనవి. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇంత సమగ్రమైన శిబిరం నిర్వహించడం అభినందనీయం. భారత రాయబారి కార్యాలయం ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తుంది,” అన్నారు.
ICBF అధ్యక్షుడు శనవాష్ భావ మాట్లాడుతూ...“ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మన సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే ఉదాహరణ. తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యుల నిబద్ధత ప్రశంసనీయం,” అన్నారు.
ICBF జనరల్ సెక్రటరీ దీపక్ షిట్టి మాట్లాడుతూ...“ఇలాంటి కార్యక్రమాలు కార్మికుల ఆరోగ్య అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సమాజ సేవలో సమితి చూపుతున్న తపన అందరికీ ఆదర్శం,” అన్నారు.
ICC ఉపాధ్యక్షుడు శాంతనూ పాండే మాట్లాడుతూ...“తెలుగు సమాజం ఆరోగ్య సేవల కోసం ఇంత చక్కగా ఏకతాటిపైకి రావడం ప్రశంసనీయమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలకు ICC ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది,” అన్నారు.
ICBF అడ్వైజరీ చైర్మన్ ప్రసాద్ రావు మాట్లాడుతూ...“ఇంత సమన్వయంతో, హృదయపూర్వకంగా నిర్వహించే మెడికల్ క్యాంప్ చాలా అరుదుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కనీసం రెండు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచిస్తున్నాను. ఈ విజయంలో ప్రతి కార్యకర్త సేవా భావం ప్రశంసనీయం,” అన్నారు.
తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మధు మాట్లాడుతూ...“మన తెలుగు కార్మికుల ఆరోగ్యమే మనకు మొదటి ప్రాధాన్యత. ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొనడం మన బృందం కృషికి నిదర్శనం,” అన్నారు.
ఈ సందర్భంగా TSA అధ్యక్షుడు అబ్బాగౌని శ్రీధర్, ప్రావీణా ముకల, ICC అడ్వైజర్ చైర్మన్ బాబు రాజన్, ICC సాంస్కృతిక కార్యదర్శి నందిని అబ్బాగౌని, వెంకప్ప, TGS అడ్వైజర్ చైర్మన్ కృష్ణకుమార్, వర్కి బాబన్, హరీష్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, సౌమ్య, సత్యనారాయణ, నరేష్, సుధ రాణి, కృష్ణా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
శిబిరం విజయవంతం కావడంలో ప్రధాన పాత్ర పోషించిన సభ్యులు — సంధ్యారాణి, ప్రీతీష్ కుమార్, సాగర్ దుర్గం, రాజేశ్వర్, వెంకటేష్, మనోహర్, భవాని, రాకేష్, నిమ్మల ప్రసాద్ మరియు అడ్వైజర్లు శంకర్ గౌడ్, గడ్డి రాజు, గోలి శ్రీనివాస్, శ్రీధర్ ఆడెపు, శ్రీధర్ తదితరులకు తెలంగాణ గల్ఫ్ సమితి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
ఈ విజయవంతమైన కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన Focus Medical Centre, ICBF, ICC, మరియు పాల్గొన్న అన్ని కార్మికులకు తెలంగాణ గల్ఫ్ సమితి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ వైద్య శిబిరం, సమాజ సేవలో తెలంగాణ గల్ఫ్ సమితి చూపుతున్న సేవా దృక్పథానికి మరో మైలురాయి అయింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ,ఖతార్)


తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







