'సైక్ సిద్ధార్థ' అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్‌టైనర్: హీరో శ్రీ నందు
- November 08, 2025
నందు, వరుణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి, స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ 'సైక్ సిద్ధార్థ' మ్యాడ్లీ హ్యూమరస్ టీజర్ రిలీజ్, డిసెంబర్ 12న ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. హీరో హైపర్యాక్టివ్,. ప్రతి చిన్న పరిస్థితికి అనూహ్యయంగా స్పందించే యువకుడు. టీజర్ ప్రారంభంలో, అతను తన స్నేహితుడితో కలిసి వైల్డ్ కారు ప్రయాణంలో, చిన్న చిన్న విషయాలపై తన నిరాశను చెబుతుంటాడు. విజయం సాధించడంలో నమ్మకం కోల్పోయిన ఓడిపోయిన వ్యక్తిగా తనను తాను చెప్పుకుంటాడు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది.
దర్శకుడు వరుణ్ రెడ్డి ఒక యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్టైనింగ్ చేశారు. నంద్ రగ్గడ్ లుక్, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ యాస , హైపర్యాక్టివ్ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. యూత్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే పాత్రలో అదరగొట్టాడు.
ఈ చిత్రంలో యంగ్ ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎమోషన్ ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది, స్మరన్ సాయి మ్యూజిక్ స్కోర్ ఫన్ ని ఎలివేట్ చేసింది. ప్రతీక్ నూతి ఎడిటర్. శ్రీ నందు ఎడిషనల్ స్క్రీన్‌ప్లేకు కూడా హెల్ప్ అయ్యింది, కథనానికి తన పర్శనల్ టచ్ ని జోడించింది.
ఈ టీజర్ హ్యాజ్ బజ్‌ను సృష్టిస్తుంది, డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. ఈ సినిమా, ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ సినిమా మీ అందరికీ నచ్చి మా టీమ్ అందరు జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటున్నాను. ఒక ప్యాట్రన్ ని బ్రేక్ చేసి ఈ టీజర్ రిలీజ్ చేద్దాం అనుకున్నా. ము టీజర్ కట్ కొత్తగా ఉండాలని ప్రయత్నంతో చేశాం. మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఫన్ ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. సురేష్ బాబు గారు. రానా గారి దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ గ్రామర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన రానా గారికి సురేష్ బాబు గారికి థాంక్యూ. సినిమాని అన్నీ నేచురల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. చాలా మంచి సినిమా చేశాం. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలో చూడని ఒక కొత్త కోణం కనిపిస్తుంది. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ .. అందరికీ హాయ్. చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. సురేష్ బాబు గారు రానా గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ టైటిల్ కథకి పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రమోషన్స్ లో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాము. నందు చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. ఈ సినిమాతో తనలోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు.
యామిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ఫిలిం. మా టీమ్ అందరు చాలా నమ్మకంతో చేశాం. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. షూటింగ్ చాలా ఫన్ గా అనిపించింది. ఆడియన్స్ కూడా అదే ఫన్ ఫీల్ అవుతారు.
సాంకేతిక బృందం:
దర్శకత్వం: వరుణ్ రెడ్డి
ఎడిషనల్ స్క్రీన్‌ప్లే: శ్రీ నందు
నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి
సంగీతం: స్మరన్ సాయి
డిఓపి: కె ప్రకాష్ రెడ్డి
ఎడిటర్: ప్రతీక్ నూతి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ మక్కపాటి
సౌండ్ డిజైనర్లు: చతుర్వేది తిరునగరి, ఉదయ్ అప్పల
మిక్సింగ్ ఇంజనీర్: సంతోష్ వోడ్నాల
కలర్ గ్రేడింగ్: శ్రీ సారథి స్టూడియోస్
ప్రొడక్షన్ హౌస్: స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్
డిస్ట్రిబ్యూషన్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: వంశీ శేఖర్
టీజర్ ఎడిటర్: ప్రతీక్ నూతి
టీజర్ కలరిస్ట్: గణేష్ కొమ్మరపు
మార్కెటింగ్: స్పిరిట్ మీడియా
డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ: సౌత్ బె
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







