2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- November 09, 2025
రియాద్: చరిత్రలో తొలిసారిగా 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) మొదటి డిప్యూటీ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం బహ్రెయిన్ క్రీడా పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
బహ్రెయిన్‌కు ఆతిథ్య హక్కులు దక్కేందుకు సహకిరంచిన హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అరబ్ జాతీయ ఒలింపిక్ కమిటీల యూనియన్ జనరల్ అసెంబ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆరవ ఇస్లామిక్ సాలిడారిటీ గేమ్స్‌ను నిర్వహించడంలో మరియు క్రీడా విజయాల రికార్డును కొనసాగించడంలో సౌదీ అరేబియా విజయం సాధించాలని హెచ్ హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







