గడిచిన 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు..
- July 24, 2016
ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.పెద్దాపురంలో 10 సెంటీమీటర్లు, చోడవరంలో 9 సెం.మీ, చింతలపుడి, తాడేపల్లి గూడెంలలో 7 సెం.మీ, విజయనగరం, బాపట్లతో 6 సెం.మీ, నర్సీపట్నం, పోలవరంలలో 5 సెం.మీ, ఎమ్మిగనూరు, మదనపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కొల్లాపూర్, అశ్వరావుపేటలలో 4 సెంటీమీటర్లు, చిన్నారావుపేటలో 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









