డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక

- November 09, 2025 , by Maagulf
డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక

న్యూ ఢిల్లీ: భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ) డిజిటల్ లేదా ఆన్‌లైన్ బంగారంలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. ఈ పెట్టుబడి పద్ధతులు తమ నియంత్రణ పరిధిలోకి రాకపోవడంతో, వాటిలో జరిగే మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టంచేసింది. సెబీ(SEBI) ప్రకారం, డిజిటల్ గోల్డ్ వ్యవస్థల్లో కౌంటర్ పార్టీ మరియు ఆపరేషనల్ రిస్కులు అధికంగా ఉంటాయి. కంపెనీలు లేదా యాప్‌ల ద్వారా విక్రయించే డిజిటల్ బంగారం అనేకసార్లు నియంత్రణలో ఉండకపోవడంతో, వినియోగదారులు మోసపోవడమో, తమ పెట్టుబడులను కోల్పోవడమో జరగవచ్చని హెచ్చరించింది.

సెబీ(SEBI) స్పష్టంచేసిన దానిప్రకారం, బంగారం పెట్టుబడికి సంబంధించి గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) మరియు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGRs) మాత్రమే అధికారికంగా తమ పరిధిలోకి వస్తాయి. ఇవి నియంత్రిత మార్కెట్లలో ట్రేడవడంతో, పెట్టుబడిదారులు నమ్మకంగా గోల్డ్‌లో పెట్టుబడి పెట్టవచ్చని సెబీ సూచించింది. ETFs ద్వారా పెట్టుబడి పెడితే బంగారం ధరల ఆధారంగా షేర్ల రూపంలో విలువ లభిస్తుంది. అదే విధంగా, EGRల ద్వారా పెట్టుబడి పెడితే నిజమైన బంగారం పరిమాణానికి సమానమైన డిజిటల్ ధ్రువీకరణ లభిస్తుంది. ఇవి పూర్తిగా నియంత్రిత, సురక్షిత పెట్టుబడి మార్గాలుగా పరిగణించబడతాయి.

సెబీ సూచన ప్రకారం, పెట్టుబడిదారులు ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లోనైనా బంగారం కొనుగోలు చేసేముందు ఆ సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ వివరాలు సరిచూసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు ఎదురవచ్చని హెచ్చరించింది. తక్షణ లాభాల మోహంలో పడకుండా, అధికారిక మార్కెట్లను ఉపయోగించడం వల్ల భద్రత ఉంటుందని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com