ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!

- November 11, 2025 , by Maagulf
ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!

యూఏఈ: షార్జా ఎయిర్ పోర్ట్ ప్రయాణికులు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై తమ ఇళ్ళు, హోటళ్ళు లేదా కార్యాలయాల నుండి సౌకర్యంగా వారి చెక్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుగా కొత్త సేవను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.   

కొత్త సర్వీస్ 'హోమ్ చెక్-ఇన్' ద్వారా ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, వారు క్యూలను దాటి నేరుగా పాస్‌పోర్ట్ సెక్షన్ కు వెళ్లవచ్చని తెలిపింది. బోర్డింగ్ పాస్‌లను జారీ చేయడం నుండి ప్రయాణీకుల ఇంటి నుండి నేరుగా లగేజీ సేకరించడం వరకు షార్జా ఎయిర్ పోర్ట్ టీమ్ ప్రతిదీ చూసుకుంటుందని వెల్లడించారు.

ప్రయాణికులు www.sharjahairport.ae ద్వారా లేదా 800745424 కు కాల్ చేయడం ద్వారా లేదా SHJ హోమ్ చెక్-ఇన్ మొబైల్ యాప్ ద్వారా సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫ్లైట్ బయలుదేరడానికి కనీసం ఎనిమిది గంటల ముందు బుకింగ్‌లు చేసుకోవాలని సూచించింది.   

బ్యాగుల సంఖ్య ఆధారంగా ప్యాకేజీల ధరను నిర్ణయించారు.  కోరల్ ప్యాకేజీ కింద 1–2 బ్యాగులకు Dh145, సిల్వర్ ప్యాకేజీ కింద 3–4 బ్యాగులకు Dh165, గోల్డ్ ప్యాకేజీ కింద 6 బ్యాగుల వరకు Dh185 వసూలు చేయనున్నారు. ఎయిర్‌లైన్ బ్యాగేజీ పాలసీకి అనుగుణంగా అదనపు బ్యాగుల ధర ఒక్కొక్కటి Dh20గా నిర్ణయించారు. ఈ సేవ ప్రస్తుతం మొదటి దశలో ఉందని, షార్జాలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉందని తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com