చైనీస్‌ ఏ డివిజన్‌ చెస్‌ లీగ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హారిక విజయం

- July 24, 2016 , by Maagulf
చైనీస్‌ ఏ డివిజన్‌ చెస్‌ లీగ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హారిక విజయం

చైనాలోని జియాజింగ్‌లో జరుగుతున్న చైనీస్‌ ఏ డివిజన్‌ చెస్‌ లీగ్‌ రెండో గేమ్‌లో తెలుగు తేజం, భారత గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక విజయం సాధించింది. షాన్‌డాంగ్‌ తరఫున ఆడుతున్న హారిక తియాజింగ్‌ ఆటగాడు ని షిక్వాన్‌ను ఓడించింది. 'ఈ రోజు నేను నల్లపావులతో ఆడాను. గేమ్‌ను వెంటనే సంక్లిష్ట దారి పట్టించాను. ప్రత్యర్థి తప్పులు చేయడంతో 26 ఎత్తుల్లోనే విజయం సాధించాను. నేను ఆడిన విధానం నాకు సంతోషాన్నిచ్చింది అని' హారిక తెలిపింది.
లీగ్‌లో షాంఘై తరఫున ఆడుతున్న భారత మరో గ్రాండ్‌ మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ప్రత్యర్థి జెన్‌ షాంగ్‌సెంగ్‌ (గ్వాంగ్‌డాంగ్‌)పై విజయం సాధించాడు. చైనీస్‌లీగ్‌లో మొత్తం 12 జట్లుంటాయి. చైనాలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లూ ఉంటారు. 22 రౌండ్లు ఉండే ఈ లీగ్‌ను ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు నిర్వహిస్తారు. ప్రస్తుత సెషన్‌ జులై 26న ముగుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com