స్వదేశానికి తిరిగివచ్చిన 'కబాలి'
- July 24, 2016
రజనీకాంత్ ఇండియా ఎప్పుడొస్తారు? అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. తలైవా (నాయకుడు) ఇండియా వచ్చేశారు. విశ్రాంతి కోసమని సుమారు నెల రోజుల క్రితం రజనీకాంత్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యలో సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం 'కబాలి'ని సైతం అమెరికాలోనే వీక్షించారు.శనివారం సాయంత్రం రజనీ అమెరికా నుంచి చెన్నై ప్రయాణమయ్యారు. ఎయిర్పోర్ట్లో రజనీని చూసిన కొందరు అభిమానులు ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చెన్నైలో రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత '2.0' షూటింగ్లో రజనీ పాల్గొంటారని సమాచారం.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









