ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- November 13, 2025
న్యూ ఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో(USA) జరిగిన బాంబు పేలుడు ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. భారతదేశానికి ఇదెంతో వ్యథను పుట్టించే సంఘటన. టెర్రరిస్టులు సామాన్యప్రజల ప్రాణాలను టార్గెట్ చేస్తూ, చేస్తున్న బాంబు దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాంబు పేలుడు కేసుపై భారత అధికారులు చాలావేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి వెనుక ఎవరు ఉన్నారనేది కనిపెట్టేశారు.
దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని.. కానీ ఆ అవసరం భారత్ కు లేదని వ్యాఖ్యానించారు.
కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం ఢిల్లీ పేలుడు కేసు విచారణకు ఎన్ ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఈ సంఘటన తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం.ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కొత్త రాయబారి సెర్గియోగోర్ అన్నారు.
ఈ జీ7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్,మార్కోరూబియోతో భేటీ అయ్యారు. ఇరువురూ మంత్రులూ భారత, అమెరికా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పేలుడుపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







