'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- November 17, 2025
మనామా: బహ్రెయిన్‌లో డిసెంబర్ 15వ తేదీన క్రౌన్ ప్లాజా ఆడిటోరియంలో జరగనున్న మెగా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ 'నిరం 2025' టిక్కెట్లను ఆవిష్కరించారు. సల్మానియాలోని కె సిటీ ఆడిటోరియంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మొదటి టికెట్‌ను SPAC గ్రూప్ చైర్మన్ పి. ఉన్నికృష్ణన్, ఆమ్సర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పార్వతికి అధికారికంగా అందజేశారు.
హ్యాపీ హ్యాండ్స్ పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజింగ్ బ్యానర్‌పై నిర్వహించనున్న 'నిరం 2025'లో మలయాళ సినిమా, సంగీత పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈవేడుకలో పాల్గొంటారు. నటుడు కుంచాకో బోబన్, గాయకుడు ఎం. జి. శ్రీకుమార్, నటుడు మరియు దర్శకుడు రమేష్ పిషారోడి, నేపథ్య గాయకుడు సిఖా హాజరయ్యే వారిలో ఉన్నారు. టిక్కెట్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కేరళ సమాజం అధ్యక్షుడు పి.వి.రాధాకృష్ణ పిళ్లై; నిరం నిర్మాత బైజు కె.ఎస్.; ప్రోగ్రామ్ డైరెక్టర్ మురళీధరన్ పల్లియత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







